హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీలాపల్లిలో ఆలయ నిర్మాణ పనులు

CTR: గుడిపాల మండలం చీలాపల్లి గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత పెరుమాళ్‌ ఆలయ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సప్తగిరి బ్యాంకు విశ్రాంత మేనేజర్‌ నాగేశ్వరరావు చొరవతో టీటీడీ నుంచి ఆలయ నిర్మాణానికి రూ.60 లక్షల నిధులు మంజూరయ్యాయి. గ్రామస్థులు సైతం వాటాలు వేసుకుని పనులను వేగవంతం చేస్తున్నారు. దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.