కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గురుకుల పాఠశాలలో సీఐ రాజగోపాల్ ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి యాప్, సైబర్ నేరాలు, సోషల్ మీడియా, ఆన్‌లైన్ మోసాలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు. అపరిచితుల మెసేజ్‌లు, అనుమానాస్పద లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100, 112 సేవలను వినియోగించుకోవాలి.
ఆంధ్రప్రదేశ్
మహిళల భద్రతపై విద్యార్థినులకు అవగాహన


