హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముమ్మరంగా పోలీసుల తనిఖీలు

అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో పోలీసులు ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. మైనర్ల డ్రైవింగ్, మద్యం తాగి నడపడం, డ్రైవింగ్ లైసెన్స్లను పరిశీలించారు. డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడుతున్న వారికి ఫైన్లు వేశారు. స్వచ్ఛందంగా రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించాలని పోలీసులు కోరారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న వారికి పదివేల రూపాయలు ఫైన్లు వేశారు.