హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జర్నలిస్టుల సమస్యలపై దశలవారీ ఉద్యమం

అన్నమయ్య: మదనపల్లెలో ఏపీయూడబ్ల్యూజే విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్‌ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘కోరికల దినోత్సవం’ నిర్వహించి, అనంతరం దశలవారీ ఉద్యమం చేపడతామని రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు తెలిపారు. జర్నలిస్ట్‌ హౌసింగ్‌ పథకం అమలు, వెటరన్‌ జర్నలిస్టులకు పెన్షన్‌, ప్రమాద బీమా పునరుద్ధరణ చేయాలన్నారు.