హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ

కృష్ణా: మచిలీపట్నం నవీన్‌ మిట్టల్‌ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైన్లు పూడిపోవడంతో చిన్నపాటి వర్షానికే మురుగు పొంగిపొర్లుతోంది. దీంతో రోడ్లపై మురుగు ప్రవహిస్తూ రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని కాలనీవాసులు తెలిపారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని వాపోయారు.