హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్ఎస్‌లో చేరిన 150 మంది యువకులు

BHPL: మున్సిపాలిటీ 23వ వార్డుకు చెందిన సుమారు 150 మంది యువకులు మనీష్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. యువత భవిష్యత్, నియోజకవర్గ అభివృద్ధి కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకగా పార్టీ నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.