హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాలుడి అపహరణ కేసు ఛేదన

NZB: ప్రభుత్వ ఆస్పత్రి నుంచి అపహరణకు గురైన రెండున్నరేళ్ల బాలుడు వేదాంష్‌ను నిజామాబాద్ పోలీసులు 24 గంటల్లో సురక్షితంగా రక్షించారు. సంగారెడ్డి జిల్లా దౌల్తాబాద్‌లో బాలుడిని గుర్తించి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. CCTV, సాంకేతిక ఆధారాలతో కేసును ఛేదించినట్లు పోలీసులు తెలిపారు.