హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లక్కిరెడ్డిపల్లెలో మహిళ కిడ్నాప్ కలకలం

అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలంలో మహిళ కిడ్నాప్, దాడి ఘటన కలకలం రేపింది. భర్త రామరాజు, అతని అనుచరులు తనను కిడ్నాప్ చేసి అడవుల్లోకి తీసుకెళ్లి దాడి చేసి వీడియో తీశారని బాధితురాలు లలిత ఆరోపించారు. తనపై దాడి చేసిన రామరాజు, గజపతిరాజు, శ్రీనివాసులపై చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని ఎస్పీని కోరారు.