NRML: నిర్మల్ పట్టణంలోని ఇంద్రనగర్ కాలనీకి చెందిన శ్రీ వైష్ణవి రిమ్స్ ఆదిలాబాద్లో ఎంబీబీఎస్ సీటు సాధించడంతో ఆమెను ఆదివారం హాకీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పాకాల రామచందర్ అభినందించారు. విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివితే ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించవచ్చని అన్నారు. శ్రీ వైష్ణవిని ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు చదువులో రాణించాలని సూచించారు.
తెలంగాణ
ప్రణాళికతో చదివితే విజయం సాధ్యం: రామచందర్


