NGKL: ఊర్కొండలో NH-167పై ఉన్న పబ్లిక్ బస్టాండ్‌ను అక్రమంగా కూల్చివేశారని స్థానిక వ్యాపారి ఎంబీ ఆరిఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 1న రాత్రి సర్పంచ్ భర్త శ్రీనివాసులు పంచాయతీ అనుమతి లేకుండా జేసీబీతో కూల్చివేశారని ఆరోపించారు. దీంతో ప్రయాణికులు నీడ లేక ఇబ్బందులు పడుతున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
బస్టాండ్ కూల్చివేతపై ఫిర్యాదు


