SRCL: మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందని ఎల్లారెడ్డిపేట ఎస్సై ఎన్. రమేష్ గౌడ్ హెచ్చరించారు. రాచర్ల గొల్లపల్లి శివారులో ఆదివారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కార్లలో సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
తెలంగాణ
మద్యం తాగి వాహనాలు నడపొద్దు: ఎస్సై


