హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్మశానవాటికలో అంతిమయాత్రకు అవస్థలు

NTR: జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి గ్రామ శ్మశాన వాటికలో కనీస సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన దారి, నీటి సదుపాయం, విద్యుత్, ప్రహరీ లేకపోవడంతో అంతిమయాత్రలు నిర్వహించడం కష్టంగా మారింది. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి శ్మశానవాటిక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్నారు.