BDK: పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో గోదావరి నదీ తీరాన ఆదివారం నదీహారతి వేడుక భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పురోహిత సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమం సాగింది. ముందుగా సీతారామచంద్రస్వామివారికి, గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అష్టోత్తర శతనామార్చనలు చేశారు. అనంతరం మంత్రోచ్ఛారణల నడుమ గోదావరి మాతకు, రామయ్యకు హారతులు సమర్పించారు.
తెలంగాణ
గోదావరి తీరంలో దివ్య హారతి వేడుక


