హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉప్పాడ తీర రక్షణ గోడకు డీపీఆర్ పనులు ప్రారంభం

KKD: ఉప్పాడ తీర ప్రాంత రక్షణ గోడ నిర్మాణానికి డిజైన్, డీపీఆర్ పనులు ప్రారంభమయ్యాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఐదుగురు నిపుణుల బృందం డ్రోన్ సర్వే చేపట్టింది. బీచ్ ప్రొఫైల్, తీర మ్యాపింగ్‌తో పాటు ఇసుక, మట్టి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తోంది. అధ్యయనం అనంతరం రక్షణ గోడ అలైన్‌మెంట్ ఖరారు చేయనున్నారు.