హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సీసీ రోడ్డు, డ్రైనేజీ లేక అవస్థలు

ASR: డుంబ్రిగూడ మండలంలోని అరమ పంచాయతీ నడిమివలస గ్రామంలో సీసీ రోడ్డు, డ్రైనేజీ కాలువ లేక గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం కురిసినప్పుడు నీరు మట్టి రోడ్డుపైనే నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానిక గిరిజనులు వాపోతున్నారు. మురుగునీరు ఇళ్ల పరిసరాల్లో నిలిచిపోవడంతో దోమలు పెరిగి పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు.