హైదరాబాద్: 28°C
తెలంగాణ

అంతర్జాతీయ పోటీలకు చిన్నారుల ఎంపిక

ADB: హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీలో ఆదివారం నిర్వహించిన 12వ జాతీయ స్థాయి కూచిపూడి పోటీల్లో ఆదిలాబాద్ బాల కేంద్రం చిన్నారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. సబ్-జూనియర్ విభాగంలో మహాశ్విని, ధన్విక, ఆధ్య 2వ స్థానం సాధించినట్లు బాల కేంద్రం పర్యవేక్షకులు మిట్టు రవి తెలిపారు. చిన్నారులు మలేషియాలో జరిగే అంతర్జాతీయ నృత్య పోటీలకు అర్హత సాధించినట్లు పేర్కొన్నారు.