MDCL: గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని కేపీహెచ్‌పీ పోలీసులు సూచించారు. మండపాల నిర్వాహకులతో రోడ్ నెం.2లోని కమ్యూనిటీ హాల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీజేలు, బాణసంచాకు దూరంగా ఉండాలని, మహిళలను గౌరవించాలని, మద్యానికి నో చెప్పాలని సూచించారు. ట్రాఫిక్, విద్యుత్, అగ్ని భద్రతా నిబంధనలు పాటించాలని కోరారు.
తెలంగాణ
డీజేలు, బాణసంచాకు 'నో' చెప్పండి


