KKD: గొల్లప్రోలులో ఏడుగురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మొత్తం రూ.10,71,925 ఆర్థిక సాయం మంజూరైంది. డిప్యూటీ సీఎం, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ చొరవతో మంజూరైన చెక్కులను జనసేన పట్టణ అధ్యక్షుడు మామిడాల సూరిబాబు, పార్టీ నాయకులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. ఇందులో దివంగత అడపా హేమంత్ లక్ష్మణ్ కుటుంబానికి అత్యధికంగా రూ.8 లక్షలు అందాయి.
ఆంధ్రప్రదేశ్
గొల్లప్రోలులో సీఎం రిలీఫ్ ఫండ్ సాయం


