హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టిప్పర్ ఢీకొని వ్యక్తి మృతి!

NTR: ఇబ్రహీంపట్నంలో సెప్టెంబర్ 1, ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో అనాసాగరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. అతివేగంగా వచ్చిన టిప్పర్ బైకును ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం పరారైన టిప్పర్ డ్రైవర్‌ను, వాహనాన్ని దోనబండ క్వారీల వద్ద పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.