VZM: భోగాపురం మండలం రామచంద్రరాజుపేటలో యువకుడిని రాత్రంతా నిర్బంధించి హింసించి, తాళ్లతో కట్టి బహిరంగంగా వీధుల్లో తిప్పిన ఘటనపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఘటనను తీవ్రంగా పరిగణించిన ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఐదుగురు నిందితులపై హత్యాయత్నం, అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
భోగాపురం ఘటనపై ఎస్పీ సీరియస్..!


