NLG: నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణవెల్లంల గ్రామంలో ఆదివారం బోనాల పండుగ ఘనంగా జరిగింది. గ్రామంలోని మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలను అలంకరించి, ఎత్తుకొని డప్పు దరువల మధ్య ఊరేగింపుగా బయలుదేరి గ్రామంలోని గ్రామ దేవతలకు బోనాలను సమర్పించారు. తమ కుటుంబాలను చల్లగా చూడమని వేడుకున్నారు. దీనితో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
తెలంగాణ
VIDEO: ఘనంగా బోనాల పండుగ


