NLR: ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ గాంధీ ఆశ్రమంలో ఆదివారం ఆశ్రమ కోఆర్డినేటర్ పందిపాటి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముందుగా ఆశ్రమ కమిటీ సభ్యులు కందికట్టు రాజేశ్వరి, గంటా విజయశ్రీ మహాత్మా గాంధీ, పోనక కనకమ్మ విగ్రహాలకు ఖాదీ వస్త్రము నూలుమాల సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గాంధీ ఆశ్రమంలో సర్వమత ప్రార్థనలు


