పార్వతీపురం జిల్లా కేంద్రం బెలగాంలోని పునీత కార్మిక జోజప్ప దేవాలయంలో ఆదివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అక్షర శిల్పుల సేవలను స్మరించుకుంటూ విచారణ పరిధిలోని 84 మంది విశ్రాంత, ప్రస్తుత ఉపాధ్యాయులను నిర్వాహకులు ఆత్మీయంగా సన్మానించారు. యూఎస్ఏ మిషనరీ ఫాదర్ వై. బాలరాజు, విచారణ గురువు ఫాదర్ బి.మహేంద్ర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఆంధ్రప్రదేశ్
అక్షర శిల్పులకు ఆత్మీయ సత్కారం


