పార్వతీపురంలోని జి.జె. కాలేజీ మైదానంలో నోబుల్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సన్మాన కార్యక్రమం నిర్వహించారు. విద్యా రంగంలో విశేష సేవలు అందిస్తూ, విద్యార్థుల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్న ఐదుగురు ఉత్తమ ఉపాధ్యాయులను క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్
గురువులకు ఘన సన్మానం


