KMM: వేంసూరులో ఇటీవల పేకాట ఆడుతూ పట్టుబడిన వారికి ఆదివారం ఎస్సై ప్రదీప్ పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ నిర్వహించారు. పేకాట, ఇతర జూద క్రీడల వల్ల కుటుంబాలు ఎలా చిన్నాభిన్నమవుతాయో వారికి వివరించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి మంచి జీవనం కొనసాగించాలని, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరంగా కఠిన తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
పేకాట నిందితులకు ఎస్సై కౌన్సిలింగ్


