హైదరాబాద్: 28°C
తెలంగాణ

వైద్య చికిత్సకు రూ.2.25 లక్షల LOC మంజూరు

BHPL: కాటారం మండలంలోని దామెరకుంటకు చెందిన చీర్ల బానయ్య అనారోగ్యంతో నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. వైద్య ఖర్చుల కోసం మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కుటుంబ సభ్యులు కోరగా, ఆయన చొరవతో CMRF ద్వారా రూ.2.25 లక్షల LOC మంజూరైంది. హైదరాబాద్‌లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో LOCను కుటుంబ సభ్యులకు అందజేశారు. మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.