HYD: గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తుతెలియని వృద్ధురాలు (60–65) మృతి చెందింది. ఈ నెల 1న క్యాజువాలిటీ ఎదుట అపస్మారక స్థితిలో కనిపించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ‘యాస్పిరేషన్ న్యుమోనిటిస్’తో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు. వివరాలు తెలిసిన వారు చిలకలగూడ పోలీసులను సంప్రదించాలని ఎస్సై కె. శివకుమార్ కోరారు.
తెలంగాణ
గాంధీ ఆస్పత్రిలో గుర్తుతెలియని వృద్ధురాలు మృతి


