హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కడపలో ఐకాన్ స్టూడియో యూనిసెక్స్ సెలూన్ ప్రారంభం

కడప నగరంలోని అల్మాస్‌పేట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఐకాన్ స్టూడియో యూనిసెక్స్ సెలూన్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి, ఆధునిక సౌకర్యాలతో మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. నూతన వ్యాపారాలు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.