హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పిల్లలను బాధ్యతాయుతంగా తీర్చిదిద్దాలి'

SDPT: పిల్లలను సన్మార్గంలో నడిపి బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదేనని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. గజ్వేల్‌లో ఆదివారం జరిగిన ప్రైవేట్‌ టీచర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీచర్లు హక్కులతో పాటు బాధ్యతలను గుర్తుంచుకోవాలని, విద్యార్థుల్లో నైతిక విలువలు, బాధ్యతా భావాన్ని పెంపొందించాలని సూచించారు.