హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ప్రజా వ్యతిరేక పాలనపై పోరాడాలి: శంకర్ గౌడ్

SRD: స్వచ్ఛమైన రాజకీయాలు అందిస్తున్న జనసేన వైపు నేటి యువత రావలసిన అవసరం ఉందని పార్టీ ఇంఛార్జ్ శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. సంగారెడ్డిలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి పార్లమెంట్ వారీగా సమావేశాలు చేపడుతున్నట్లు తెలిపారు.