హైదరాబాద్: 28°C
తెలంగాణ

సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: SP

ADB: జిల్లా ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ ఆదివారం సూచించారు. జిల్లాలో ఈ వారం రోజుల్లో 10 సైబర్ ఫిర్యాదులు అందాయని తెలియజేశారు. ఇన్వెస్ట్‌మెంట్, OLX, ఆన్‌లైన్ షాపింగ్, గేమింగ్ యాప్‌లు, నకిలీ లోన్ల పేరుతో మోసాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. సైబర్ నేరాలతో మోసపోతే వెంటనే 1930కు కాల్ చేయాలని అఖిల్ మహాజన్ సూచించారు.