హైదరాబాద్: 28°C
తెలంగాణ

భద్రకాళిలో సామూహిక ఘోష్‌ ప్రదర్శన

WGL: రాష్ట్ర సేవికా సమితికి 90 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్ భద్రకాళి ఆలయ ప్రాంగణంలో ఆదివారం ‘ప్రణవ నాదం’ పేరుతో సామూహిక ఘోష్‌ ప్రదర్శన నిర్వహించారు. 90 మంది సేవికలు ఆనక్‌, వంశీ, ఝల్లరి, శంఖం తదితర వాద్యాలతో ప్రదర్శన ఇచ్చారు. సంప్రదాయ వేషధారణలో మహిళలు, యువతులు, బాలికలు పాల్గొని భక్తులను ఆకట్టుకున్నారు.