హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కలకడ-పీలేరు మార్గంలో రోడ్డు ప్రమాదం

అన్నమయ్య: కలకడ నుంచి పీలేరు వైపు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని మరో బైక్ ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో బన్ని (18), శ్రీను (20), షారూ (20) గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే కలకడ 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యంకోసం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.