PLD: రాజుపాలెం,కొండమోడు డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న సాదినేని నరసింహారావును శ్రీ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జాతీయ ప్రతిభా అవార్డు వరించింది. రసాయన శాస్త్రంలో సరికొత్త మెలకువలతో విద్యాబోధన అందించినందుకు అవార్డును ప్రకటించారు. రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు
ఆంధ్రప్రదేశ్
రసాయన శాస్త్ర అధ్యాపకుడికి జాతీయ ప్రతిభా అవార్డు


