హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆన్‌లైన్ మోసాలపై అవగాహన సదస్సు

KNR: శంకరపట్నం మండలం ఆర్ఖండ్ల గ్రామంలో ఆదివారం పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్సై శేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు కానిస్టేబుల్ వంశీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, ట్రాఫిక్ నిబంధనలు, ప్రజా భద్రతపై అవగాహన కల్పించారు. యువత నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు.