నంద్యాల పట్టణంలోని నూనెపల్లెకు చెందిన వైసీపీ నేత తిక్కన్న ఆధ్వర్యంలో పలువురు టీడీపీలో చేరారు. ఆదివారం నూనెపల్లెలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ సమక్షంలో సుమారు 100 మంది టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి మంత్రి ఫరూక్ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ నుంచి టీడీపీలోకి 100 మంది


