హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యవసాయ బావిలో పడి రైతు మృతి

KNR: కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి శివారులో వ్యవసాయ బావిలో పడి రైతు బొజ్జ లచ్చయ్య (55) మృతి చెందాడు. వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు బావిలో జారిపడి రాళ్లపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆదివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.