KMM: నేలకొండపల్లిలో 17ఏళ్ల బాలికకు బాల్యవివాహం జరిపిన ఘటనపై ఆదివారం కేసు నమోదు అయింది. చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కి వచ్చిన సమాచారంతో పంచాయతీ కార్యదర్శి సంపత్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ నాగమణి, విచారణ చేపట్టారు. శనివారం ఉదయం పెళ్లి జరిగినట్లు గుర్తించారు. కార్యదర్శి ఫిర్యాదు మేరకు వరుడు, బాలిక తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు SI శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ
బాల్య వివాహంపై కేసు నమోదు


