హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్కపల్లిలో ముదిరాజ్ సంఘ భవనానికి భూమిపూజ

SRCL: ఎల్లారెడ్డిపేట (M) అక్కపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘ భవన నిర్మాణానికి ఎంపీ బండి సంజయ్ ఎంపీ నిధుల నుంచి రూ.3 లక్షలు మంజూరు చేయించారు. ఈ నిధులతో చేపట్టనున్న భవన నిర్మాణ పనులకు ముదిరాజ్ సంఘం నాయకులు భూమిపూజ చేశారు. నిధులు మంజూరు చేసిన ఎంపీ బండి సంజయ్‌కు సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పండుగ బాబు, నాయకులు, పాల్గొన్నారు.