హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డుపై చెత్త కుప్పలు.. వైసీపీ నేత ఆగ్రహం

ASR: డుంబ్రిగూడ మండలం కోసంగి-పెదపాడు ప్రధాన రహదారిపై పేరుకుపోయిన చెత్తను తొలగించాలని వైసీపీ మండల కార్యదర్శి మఠం శంకర్‌ ఆదివారం డిమాండ్‌ చేశారు. రహదారిని పరిశీలించిన ఆయన.. రహదారిపై చెత్త కుప్పలుగా పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోందని, దోమలు, ఈగలు వృద్ధి చెంది అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.