హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీలిమిటేషన్‌పై కేకే కీలక వ్యాఖ్యలు

విశాఖ కార్పొరేషన్ వార్డుల డీలిమిటేషన్‌పై వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. జీవీఎంసీ పరిధిలో అధికారులు వార్డుల పునర్విభజన ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వార్డుల విభజన వల్ల స్థానిక ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సచివాలయాల మ్యాపింగ్ చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.