హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఘనంగా పెద్దమ్మ తల్లి బోనాలు

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని బచ్చన్నపేట, గోపాల్ నగర్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లికి బోనాల వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. కుల పెద్దమనిషి వద్ది మల్లయ్య, సంఘం సభ్యులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.