హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల ఫైనల్ జాబితా సిద్ధం

ELR: ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల ఫైనల్ జాబితాను ఈ నెల 7వ తేదీన ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రదర్శనకు ఏర్పాటు చేస్తున్నామని ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గుర్తించిన జాబితాపై ఇప్పటికే గ్రామసభలు పూర్తయ్యాయని, వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి ఫైనల్ జాబితాను రూపొందించామన్నారు. ఓటర్లు తమ గుర్తించిన కులాల జాబితాను సరిచూసుకోవాలని కోరారు.