NRML: బాసరలో రూ.324 కోట్లతో చేపట్టనున్న ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ప్రాకార మండపాలు, క్యూ కాంప్లెక్స్ నిర్మాణాలకు మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. అనంతరం రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, ఎన్‌సీసీ, ఆర్‌అండ్‌బీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ
బాసర ఆలయ పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన


