WGL: శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన రత్నాల రాజేశ్వరి (76) ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్‌కు వచ్చారు. రైల్వే స్టేషన్‌లో తన లగేజ్ బ్యాగ్‌ను మరిచిపోయి వెళ్లారు. విధుల్లో ఉన్న జీఆర్పీ సిబ్బంది బ్యాగ్‌ను స్వాధీనం చేసుకొని సమాచారం అందించారు. దీంతో ఆదివారం మధ్యాహ్నం స్టేషన్‌కు వచ్చిన రాజేశ్వరికి సీఐ బ్యాగ్ అందజేశారు.
తెలంగాణ
'పోగొట్టుకున్న బ్యాగును అందించిన పోలీసులు'


