హైదరాబాద్: 28°C
తెలంగాణ

AIKMS రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి: IFTU

GDWL: మంచిర్యాలలో సెప్టెంబర్ 8, 9 తేదీల్లో జరిగే అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) 9వ రాష్ట్ర మహాసభల గోడపత్రికను ఆదివారం ఐజలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షుడు జమ్మిచేడు కార్తీక్ ఆవిష్కరించారు. పాలకుల సరళీకరణ విధానాలతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని విమర్శించారు. మద్దతు ధర, నకిలీ విత్తనాల నివారణ తదితర సమస్యలపై మహాసభల్లో కార్యాచరణ రూపొందిస్తామన్నారు.