హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రీనివాసపూర్‌లో బీఆర్‌ఎస్‌ పోరుబాట

WNP: కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జిల్లాలోని శ్రీనివాసపూర్ 8వ వార్డులో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. మురికి కాలువల శుద్ధి సక్రమంగా జరగడం లేదని, నర్సరీ నిర్లక్ష్యానికి గురైందని బీఆర్‌ఎస్‌ నాయకులు ఆరోపించారు. మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి హయాంలో రూ.1.50 కోట్లతో ఏర్పాటు చేసిన నర్సరీ అభివృద్ధి చేయాలన్నారు.