హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమస్యలు పరిష్కరించాలని మహాధర్నా

NLG: చిట్యాలలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ఆదివారం బీఆర్ఎస్ నాయకులు మహాధర్నా నిర్వహించారు. తాగునీరు, డ్రైనేజీ, పారిశుధ్యం, లోవోల్టేజీ, వీధిదీపాలు, అసంపూర్తి ఫ్లైఓవర్ పనులతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు తీర్చకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మాజీ ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.