హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

MNCL: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఆదివారం లక్షెట్టిపేట పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో దండేపల్లి, లక్షెట్టిపేట మున్సిపాలిటీలు, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 312 మంది లబ్ధిదారులకు రూ. 90 లక్షల విలువైన సీఎం సహాయనిధి (CMRF) చెక్కులను ఆయన పంపిణీ చేశారు.