KKD: సామర్లకోట భాస్కర్ కాలనీలో వినాయక చవితి ఉత్సవాలకు ఆదివారం ముహూర్తపు పందిరి రాట కార్యక్రమం నిర్వహించారు. గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ బడుగు శ్రీకాంత్, మహంకాళి వెంకట గణేష్, పాగా సురేష్ కుమార్ ప్రత్యేక పూజలు చేసి రాట వేశారు. అనంతరం నవధాన్యాలు వేసి జై గణేష్ నామస్మరణ చేశారు. కార్యక్రమంలో కాలనీ యువకులు, మహిళలు పాల్గొని ప్రసాదం స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
సామర్లకోటలో వినాయక చవితి ఉత్సవాలకు శ్రీకారం


